టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌసుల్లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం పలు సినిమాలను నిర్మిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ మారు. అంతేకాదు ఈమధ్య సినిమాలను నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమాలను రిలీజ్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ఇప్పటికే ఎన్నో పెద్ద సినిమాలను రిలీజ్ చేశారు. ప్రస్తుతం పలు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. తెలుగు మాత్రమే కాదు తమిళ్ సినిమా రిలీజ్ హక్కులను కూడా సొంతం చేసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ వారు తమిళ్ మోస్ట్ అవైటెడ్ సినిమా అయిన కంగువ నైజాం హక్కులను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో సినిమా హక్కులు మైత్రీ చేతిలోకి వచ్చాయి. ఆ సినిమా మరేదో కాదు దళపతి విజయ్ హీరోగా వస్తున్న ది గోట్ సినిమా. ఈసినిమా రెండు తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులను కూడా మైత్రీ మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకున్నారు.
కాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈసినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























