టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి క్యామియో రోల్స్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరో స్థాయికి అడిగాడు. ప్రముఖ తెలంగాణ చేనేత కళాకారుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాతో తనలో అద్భుతమైన నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘డార్లింగ్’. ‘వై దిస్ కొలవరి?’ అనేది టాగ్ లైన్‌గా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. జూలై 19వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌ని మొదలుపెట్టారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘ఖలసే’, ‘రాహీ రే’ పాటలు సంగీత ప్రియులను అలరించాయి. ఈ నేపథ్యంలో డార్లింగ్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం సిద్ధమైంది.
కాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రేపు, అనగా ఆదివారం హైదరాబాద్ లోని ప్రముఖ AAA సినిమాస్ మల్టీప్లెక్స్ స్క్రీన్ 5లో ఉదయం 10 గంటలకు జరుగనుంది. ఇక ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హాజరుకానుండటం విశేషం. విశ్వక్ చేతులమీదుగానే డార్లింగ్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ భామ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బ్రహ్మనందం, అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్, విష్ణు, కృష్ణతేజ, శివారెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ‘హనుమాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైనమెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. చైతన్య రెడ్డి సగర్వంగా సమర్పిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























