దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్సకత్వంలో జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్. ‘గంగూబాయి కతియావాడి’ సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ తాజాగా కొత్త మూవీకి శ్రీకారం చుట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్ ఫేమ్ శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటి శార్వరి ఓ కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ చిత్రానికి ‘ఆల్ఫా’ అని టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు మేకర్స్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్యచోప్రా గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో నటించనున్న నటీనటులు మరియు పనిచేయనున్న ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























