డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ పూర్తి

double ismart movie shoot completed

ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈసినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాకు షూటింగ్ కు మధ్యలో గ్యాప్ కూడా వచ్చింది. అప్పుడ ఈసినిమా ఆగిపోయిందన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ రూమర్లు ను చిత్రయూనిట్ ఖండించి.. ఆమధ్య షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈసినిమా టీజర్ ను కూడా ఎప్పుడో రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఈసినిమా 100 మిలియన్ వ్యూస్ ను సైతం సొంతం చేసుకుంది. అంతేకాదు ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే స్టెప్పామార్ అనే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ బీట్ తో ఉన్న ఈసాంగ్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి మరో అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ పూర్తయిందని తెలిపారు.

కాగా ఈసినిమాలో కావ్యా థాపర్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో అలీ, షయాజీ షిండే, గెటప్ శ్రీను, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను పూరి కనెక్ట్స్‌ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కే నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈసినిమాను ఆగష్ట్ 15వ తేదీన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.