NKR21 నుండి కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ రివీల్

Nandamuri Kalyan Ram First Look Revealed From NKR21 Movie

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటారు. రెండేళ్ల క్రితం ‘బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయారు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన ‘అమిగోస్’, ‘డెవిల్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఓ కొత్త సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

NKR21 అనే వర్కింగ్ టైటిల్​తో వ్యవహరిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇంతకుముందు ఈ సినిమా నుంచి ‘ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్’ పేరుతో విడుదల చేసిన 33 సెకన్ల నిడివిగల స్పెషల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. శుక్రవారం కళ్యాణ్ రామ్ జన్మదినం సందర్భంగా #NKR21 నుండి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఇక ఈ పోస్టర్ గమనిస్తే.. ఒక రూమ్‌లో మంటలు చెలరేగుతుండగా.. కళ్యాణ్ రామ్ కుర్చీలో కూర్చుని పిడికిలి బిగించి పట్టుకుని చాలా సీరియస్​గా చూస్తున్నాడు. ఇక ఆ పిడికిలి నుంచి కూడా మంటలు వస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే ఆయన ముందు ఒక వ్యక్తి పడిపోయి ఉండగా, వెనుకవైపు మరికొందరు నిలబడి ఉన్నారు. చూస్తుంటే.. ఇదేదో హై వోల్టేజ్ యాక్షన్ సీన్ లా అనిపిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ మూవీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కాగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ మరియు అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ బలుసు, అశోక్ ముప్పాలతో కలిసి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ వీలైనంత త్వరగా ముగించి భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.