మాస్ మహారాజా రవితేజ కూడా ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళతున్నాడు కానీ ఈ మధ్య కాలంలో రవితేజకు సాలిడ్ హిట్ దక్కింది లేదు. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. నామ్ తో సునా హోగా అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి షో రీల్ పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేయగా అది మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా మ్యూజికల్ జర్నీ మొదలవుతుంది.. మిక్కీ జే మేయర్ అందించిన చార్ట్ బస్టర్ ఆల్బమ్ ను వినడానికి రెడీగా ఉండండి.. ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను త్వరలో ఇవ్వనున్నట్టు తెలిపారు.
ఈసినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.
మరి హరీష్ శంకర్ – రవితేజ కాంబినేషన్ లో గతంలో షాక్, మిరపకాయ సినిమాలు వచ్చాయి. వాటిలో మిరపకాయ సినిమాను ఇప్పటికీ చూస్తూనే ఉంటారు. అందువల్ల ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చూద్దాం ఈసినిమా రవితేజకు మంచి కమ్ బ్యాక్ సినిమా అవుతుందో?లేదో..!
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























