ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు టాలెెంటెడ్ యాక్టర్ సుహాస్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈఏడాది ఇప్పటికే అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్నవదనం సినిమాలతో విజయాలను అందుకోగా.. ఇప్పుడు ఈ యంగ్ హీరో ఖాతాలోకి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు వచ్చి చేరింది. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో సుహాస్ హీరోగా వస్తున్న సినిమా జనక అయితే గనక. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా టైటిల్ ను రెండు రోజుల క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్. జనక అయితే గనక అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. అంతేకాదు ఈసినిమా టీజర్ ను నేడు రిలీజ్ చేయనున్నట్టు కూడా ఇప్పటికే తెలియచేశారు కూడా. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ ఒక్క డెసిషన్ నా లైఫ్ ను మార్చేసింది అంటూ సుహాస్ డైలాగ్ తో టీజర్ మొదలవ్వగా కామెడీగా సాగింది.. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదు అని సుహాస్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. టీజర్ ను బట్టి బాగా సెటిల్ అయిన తరువాతే సుహాస్ తండ్రి అవ్వాలనుకంటాడు.. ఈమధ్యలో జరిగే పరిణామాలే ఈసినిమా కథగా తెలుస్తుంది. సుహాస్ ఇంకా గోపరాజు మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వు తెప్పించేలా కనిపిస్తున్నాయి. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది.
కాగా ఈసినిమాలో సంకీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, గోపరాజు, రఘుబాబు, పృథ్వీ, శివన్నారాయణ, రూపలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పై వస్తున్న ఈసినిమాను హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, సంగీతం: విజయ్ బుల్గానిన్ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























