హిందీలో డబుల్ సెంచరీ దిశగా కల్కి

Kalki 2898 AD Running Towards Double Century

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 AD’. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. జూన్ 27న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే తొలి ఆటతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో ఈ విజువల్ వండర్‌ విడుదలైన అన్నిచోట్లా మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇదేక్రమంలో నార్త్ ఇండియాలోనూ కల్కి మూవీ అదరగొడుతోంది. ఇప్పటికే ఈ ఏడాది హిందీలో తొలిరోజు వసూళ్ళలో అత్యధిక నెట్ అందుకున్న రెండో సినిమాగా రికార్డ్ సృష్టించిన కల్కి బాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా నిలిచింది.

కాగా ఈ చిత్రం అక్కడ సుమారు 1,000 స్క్రీన్‌లలో ప్రదర్శించబడుతుండటం గమనార్హం. ఫస్ట్ వీకెండ్‌లో అదరగొట్టిన కల్కి వీక్ డేస్ లోనూ ఏమాత్రం తగ్గకుండా అదరగొడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా 7వ రోజైన బుధవారం రూ. 150 కోట్లు నెట్ అందుకుంది. ఈ వీకెండ్ కల్లా రూ. 200 కోట్లు అందుకోవచ్చని ప్రముఖ బాలీవుడ్ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో వెల్లడించారు.

కాగా కల్కి చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్‌ అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్‌ బచ్చన్‌ మరియు కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.