స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు మళ్లీ తెలుగులో పలు సినిమాలతో బిజీ అయిపోయింది. అందులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేర సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఈసినిమాలో తన షూటింగ్ ను కూడా ఇప్పటికే పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో రష్మిక ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా రిలీజ్ టైమ్ ను ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు. రష్మిక ఫస్ట్ లుక్ ను రేపు అంటే జులై 5వ తేదీన ఉదయం 11 గంటల 34 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
టీజర్ అయితే ఆకట్టుకుంటుంది.
కాగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ తో పాటు పలు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























