టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అగ్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. జీనియస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజువల్ వండర్‌గా తెరకెక్కిన కల్కి సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. దీంతో ఈ మైథాలజీ-ఇన్స్‌స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మూవీ బ్లాక్ బస్టర్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. అయితే ఈ చిత్రం కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్‌లో సైతం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో అనేక రికార్డులను బద్దలు కొడుతోంది.
ఈ క్రమంలో తాజాగా మరో మైలురాయిని దాటింది కల్కి. కల్కి చిత్రం ఫస్ట్ వీక్‍లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ రాబట్టుకుంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం, రూ. 700 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. కాగా ప్రభాస్ నటించిన రెండు చిత్రాలు ఇలా వరుసగా రూ. 700 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. దీనికి ముందు సలార్ సినిమా కూడా రూ. 700 కోట్లు గ్రాస్ అందుకుంది. దీంతో ఈ ఫీట్ సాధించిన తొలి సౌత్ హీరోగా ప్రభాస్ నిలిచాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























