ఓజీ గురించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన పవర్ స్టార్

Powerstar Pawan Kalyan Interesting Comments on OG and Other Movie Shootings

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన సినిమాలపై దృష్టి పెడతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం తాను ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచిన పిఠాపురం నియోజకవర్గానికి తొలిసారి వెళ్లిన సందర్భంగా ఒక భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అభిమానులు ‘ఓజీ ఓజీ’ అని పెద్దగా నినదించారు. దీంతో ఆయన తనదైన స్టైల్‌లో స్పందిస్తూ ఓజీ సినిమానా..? అని అడిగారు.

“ఓజీనా? సినిమాలు చేసే టైమ్ ఉందంటారా? ఎలాగూ మాట ఇచ్చాం కాబట్టి.. ముందు ఒక మూడు నెలలు మీకోసం వర్క్ చేయాలి. కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు అని తిట్టుకోకూడదు కదా. మిమ్మల్ని గెలిపిస్తే.. పనిచేయకుండా మీరు వెళ్లి ఓజీ ఏంటి, అని క్యాజీ అంటే నేనేం చెప్పను. గుంతలు పూడ్చిన తర్వాత షూటింగ్స్‌కు వెళ్తాను. కుదిరినప్పుడల్లా 2,3 రోజులు షూటింగ్‌కు వెళ్తా. దీనిపై నిర్మాతలకు కూడా క్షమాపణలు చెప్పాను. ఓజీ చూద్దురుగానీ.. బావుంటుంది” అని అన్నారు.

సో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాల కోసం మరికొంతకాలం.. కనీసం.. 2, 3 నెలలైనా ఓపిక పట్టాల్సిందే. ఇక ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘ఓజీ’ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్‌ రాజ్‌, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే కిక్‌ శ్యామ్‌, వెంకట్‌ బచ్చు, అజయ్‌ ఘోష్‌, మొట్ట రాజేందర్‌, జీవా, హరీష్‌ ఉత్తమన్‌, శాన్‌ కక్కర్‌, అభిమన్యు సింగ్‌, కుమనన్‌ సేతురామన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.