కల్కిలో ఆ రెండు పాత్రలకు తెలుగు డబ్బింగ్ చెప్పింది వీరే..!

Kalki 2898 AD Voices For Sumati and Lord Sri Krishna Characters in Telugu Given by Two Celebs

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అగ్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. జీనియస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజువల్ వండర్‌గా తెరకెక్కిన కల్కి సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. దీంతో ఈ మైథాలజీ-ఇన్స్‌స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మూవీ బ్లాక్ బస్టర్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌‌గా దూసుకుపోతోంది. అయితే ఈ చిత్రం కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్‌లో సైతం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో అనేక రికార్డులను బద్దలు కొడుతోంది.

ఈ నేపథ్యంలో కల్కి 2898 AD నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే..? చిత్రంలో దీపికా పదుకొణె సుమతి అనే కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే మరో ముఖ్య పాత్ర శ్రీకృష్ణుడిగా కోలీవుడ్ యువ నటుడు కృష్ణకుమార్ బాలసుబ్రమణియన్ నటించారు. కాగా తెలుగు వెర్షన్‌లో వీరి పాత్రలకు గాత్రం అందించింది ఇద్దరు ప్రముఖులు కావడం విశేషం. టాలీవుడ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల సుమతికి, అర్జున్ దాస్ శ్రీకృష్ణుడికి తెలుగులో డబ్బింగ్ చెప్పారు.

ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.