టాలీవుడ్‌లోని క్రేజీ కాంబినేషన్లలో ఒకటి స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్లో కొత్త మూవీ రాబోతోంది. కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ఓ కీలక అప్డేట్ అందించింది చిత్ర బృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జూలై 3వ తేదీన ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. అలాగే మూవీ రెగ్యులర్ షూట్ కూడా ఈ వారంలోనే స్టార్ట్ అవుతుందని కూడా సమాచారం. ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే కథతో ట్రయాంగిల్ ఎంటర్టైనర్గా రూపొందనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమాలో ‘గుంటూరు కారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో కథానాయికగా ఐశ్వర్య రాజేష్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు, పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
కాగా దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలు సాధారణంగా కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటాయి. వెంకటేష్ హీరోగా గతంలో ఆయన తెరకెక్కించిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. వీటిలో వెంకీ తనదైన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవించాడు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో మూవీ రానుండటం, అది కూడా రెండు హ్యాట్రిక్ చిత్రం అవడం విశేషం. దీంతో ఈ సినిమా కూడా నవ్వుల పూవులు పూయించడం గ్యారంటీ అని భావిస్తున్నారు సినీ జనాలు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























