టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుహాస్. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో అలరించగా అందులో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా సూపర్ హిట్ టాక్ ను అందించగా.. ప్రసన్న వదనం సినిమా డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సుహాస్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది. ఈసినిమా చాలా సైలెంట్ గా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటున్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా టైటిల్ ను ఇప్పటివరకూ ప్రకటించలేదు మేకర్స్. ఇప్పటివరకూ అనే వర్కింగ్ టైటిల్ తోనే సినిమాను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా టైటిల్ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా టైటిల్ ను రేపు అంటే జులై 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈసందర్భంగా ఒక ఫన్నీ వీడియోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.
కాగా సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో సంకీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, గోపరాజు, రఘుబాబు, పృథ్వీ, శివన్నారాయణ, రూపలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పై వస్తున్న ఈసినిమాను హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, సంగీతం: విజయ్ బుల్గానిన్ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























