ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి హంగామానే కనిపిస్తుంది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలను నిజం చేస్తూ ఈసినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నటీనటుల నటన, వావ్ అనిపించేలా విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఫస్ట్ డే ఈసినిమా 191 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకొని ఇండియన్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టుకున్న సినిమాల జాబితాలో 3వ సినిమాగా స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు సెకండ్ డే కలెక్షన్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. సెకండ్ డే ఈ సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుంది. దీంతో రెండు రోజులకుగాను ఈసినిమా 298 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లో కల్కి రూ.298.50 కోట్ల కలెక్షన్ చేసినట్లు మూవీ టీమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇక వీకెండ్ వస్తుంది.. ఈ రెండు రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి 500 కోట్ల క్లబ్ లోకి చేరుతుందేమో చూద్దాం..
కాగా ఈసినిమాలో ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, సస్వతా ఛటర్జీ, శోభన, అన్నా బెన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఈసినిమాను తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























