పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధానపాత్రలో నటించగా, క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 AD’. భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అందుకు తగ్గట్లే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. కాగా భారతీయ సినిమా చరిత్రలో దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడిన అత్యంత ఖరీదైన మూవీగా కల్కి రికార్డ్ నెలకొల్పింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా భారతీయ సినిమా చరిత్రలో దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడిన అత్యంత ఖరీదైన మూవీగా కల్కి రికార్డ్ నెలకొల్పింది. ఇక ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ మరియు ఇంగ్లీష్ సహా మొత్తం ఆరు భాషల్లో విడుదలవడం విశేషం.అయితే ఈ చిత్రంలో కొందరు తారలు కొన్ని క్యామియో రోల్స్‌లో కనిపించి సందడి చేశారు.
వీరిలో టాలీవుడ్‌కు చెందిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ‘మహానటి’ ఫేమ్ దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ), ఎస్ఎస్. రాజమౌళి, కేవీ అనుదీప్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, నటుడు అవసరాల శ్రీనివాస్, మాలీవుడ్ హీరోయిన్ మాళవిక నాయర్, ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్, ప్రముఖ మలయాళ నటి అన్నా బెన్, ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా తదితరులు అతిథి పాత్రల్లో నటించారు.
ఇక వీటిలో ప్రధానంగా విజయ్ దేవరకొండ పాత్ర హైలైట్ అయింది. కల్కిలో ఆయన ఉండేది కొద్దిసేపే అయినా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయేలా వుంటుంది. కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మహాభారతంలోని అర్జునుడి పాత్రలో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఈ క్యారెక్టర్లో ఆయన పర్ఫెక్ట్గా సరిపోయాడని మూవీ చూసినవారు చెబుతున్నారు.
అర్జునుడి గెటప్‌లో విజయ్ మేకోవర్, చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడిగా ఆయన చూపించిన ఎమోషన్స్ సింప్లీ సూపర్బ్ అని వారు మెచ్చుకుంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ స్క్రీన్ మీద కనిపించినప్పుడు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. కాగా విజయ్ పౌరాణిక పాత్రలో కనిపించడం ఆడియెన్స్కును థ్రిల్‌కి గురిచేస్తోంది.
కాగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్గా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























