పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం కల్కి ‘2898 AD’. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీలింగ్యువల్ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గురువారం గ్రాండ్ రిలీజ్ అయింది. విడుదలకు ముందే మూవీపై భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే తొలి ఆటతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా ఉందని, ఇలాంటి సినిమా ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రాలేదని మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా హోరెత్తిస్తున్నారు. దీంతో విడుదలైన అన్నిచోట్లా మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా కల్కి సెన్సేషన్ సృష్టిస్తోంది. అలాగే ఓవర్‌సీస్‌లోనూ రికార్డు స్థాయిలో డాలర్ల వర్షం కురిపిస్తోంది.
ఇక ఇదిలావుండగా బాలీవుడ్‌లో సైతం కల్కి మూవీ అదరగొడుతోంది. బాహుబలి నుంచే హిందీ బెల్ట్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ఆ తరువాత నుంచి అక్కడ ప్రతి సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కల్కి కూడా హిందీ రాష్ట్రాల్లో తన హవా చూపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రూ. 22.50 కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. తద్వారా ఈ ఏడాది హిందీలో తొలిరోజు వసూళ్ళలో రెండో అత్యధికంగా నిలిచింది.
కాగా అంతకుముందు హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘ఫైటర్’ చిత్రం రూ.24.60 కోట్లకుపైగా కలెక్షన్స్ అందుకుని మొదటి స్థానంలో నిలిచింది. అయితే డైరెక్ట్ హిందీ సినిమాల స్థాయిలో మన టాలీవుడ్ హీరోకు అక్కడ భారీ ఓపెనింగ్స్ లభించడం అభినందించదగ్గ విషయం. ఇక రేపు, ఎల్లుండి వీకెండ్ కావడం, అలాగే బాక్సాఫీస్ బరిలో మరే చిత్రం లేకపోవడం కల్కికి బాగా కలిసి వచ్చే అంశం. దీంతో ఈ వారాంతానికి కల్కి కళ్ళు చెదిరే కలెక్షన్స్ కళ్లజూసే అవకాశం ఉంది.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























