ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే పలు పోస్టర్లు, టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా రిలీజ్ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇటీవల ఈసినిమా రిలీజ్ పై పలు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఈ ఏడాది చివరిలో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు కథనాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఫైనల్లీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అక్టోబర్ 10 వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలుపుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరి ఇంతకు ముందు ఈ డేట్ ను దేవర సినిమా ఫిక్స్ చేసుకున్నారు. అయితే దేవర ఈ డేట్ ను మార్చుకొని ప్రీ పోన్ అయింది.
కాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























