కల్కి చివరి 30 నిమిషాలు తనను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిందని పేర్కొన్నారు దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచుకుంది. దీంతో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో రాజమౌళి ఈ మూవీని వీక్షించారు. అనంతరం ఈ ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాపై రివ్యూ ఇచ్చారు. ‘బాహుబలి’ సిరీస్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి కల్కి మూవీ చూసి చూసి ఆశ్చర్యపోయారు. డైరెక్టర్ నాగి విజన్‌కు, ప్రభాస్ సహా ఇందులో నటించిన నటీనటుల పెర్ఫార్మన్స్‌కు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో కల్కి చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
“2898 AD నాటి కల్కి ప్రపంచ నిర్మాణాన్ని ఇష్టపడ్డాను.. దాని అద్భుతమైన సెట్టింగ్‌లతో ఇది నన్ను పలు టెరిటరీల్లోకి తీసుకెళ్లింది. డార్లింగ్ తన టైమింగ్ మరియు ఈజ్ తో చంపేశాడు. అమితాబ్ జీ, కమల్ సర్ మరియు దీపిక మీరు ఈ చిత్రానికి గొప్ప మద్దతుగా నిలిచారు. సినిమా చివరి 30 నిమిషాలు నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. దానిని అమలు చేయడంలో వారి అసమాన ప్రయత్నాలకు నాగి మరియు మొత్తం వైజయంతి టీమ్‌కు అభినందనలు” అని పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























