ప్రస్తుతం విభిన్నమైన సినిమాలను చేస్తూ.. డీసెంట్ హిట్లను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు నిఖిల్. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో వచ్చేస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా వస్తుండగా.. ఈసినిమాలో నిఖిల్ వారియర్ గా కనిపించనున్నాడు. ఇక ఈసినిమా ఇప్పటివరకూ రిలీజ్ చేసిన నిఖిల్ పోస్టర్లు అన్నీ ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఈసినిమా కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. ఈ షెడ్యూల్ లో నిఖిల్ తో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నభ నటేష్ కూడా మరో కీలక పాత్రలో చేయనుంది. ఈసినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి అందిస్తుండగా. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఎం.ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగరి డైలాగ్స్ అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























