‘మ్యాడ్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నితిన్ సోలో హీరోగా నటించిన సినిమా ‘ఆయ్’. ‘మేం ఫ్రెండ్సండి’ అనేది ట్యాగ్ లైన్‌గా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఆయ్ అనేది గోదావరి ప్రజల వాడుక భాషలో బాగా పాపులర్ అయిన పదం అన్న సంగతి తెలిసందే కదా. దీంతో ఈ సినిమా టైటిల్ తోనే ప్రతి ఒక్కరినీ బాగా ఆకట్టుకుంటోంది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన నయన్ సారిక హీరోయిన్గా నటిస్తోంది.
షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఈ సినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్ సుఫియానా, రెండో పాట రంగనాయకి రిలీజ్ చేయగా మంచి అప్లాజ్ వచ్చింది. ఈ పాటలో నితిన్ డ్యాన్స్ హైలెట్ అయ్యింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, జూ. ఎన్టీఆర్ లను ఇమిటేట్ చేయడం విశేషం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
ఈ మేరకు సోషల్ మీడియాలో.. “గోదావరి ఎమోషన్, ప్రేమ, స్నేహం మరియు మరెన్నో జరుపుకోవడానికి సన్నద్ధమవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది” అని అందులో పేర్కొన్నారు. అయితే అదేరోజున పూరి జగన్నాథ్-రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం కూడా థియేటర్లలోకి రానుంది. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ‘లక్కీ భాస్కర్’ కూడా అదే డేట్‌కి రావొచ్చని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆయ్ చిత్రం విడుదల కానుండటం ఆసక్తికరంగా ఉంది. ఇక నార్నె నితిన్ సోలో హీరోగా చేస్తోన్న తొలి సినిమా కావడం, మూవీపై కూడా మంచి బజ్ క్రియేట్ అవుతున్న క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తప్పకుండా హిట్ అవుతుందని నిర్మాతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ స్టోరీలే బలంగా మినిమం గ్యారంటీ చిత్రాలను రూపొందించే గీతా ఆర్స్ట్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























