న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన జెంటిల్ మెన్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నివేదా థామస్. ఈసినిమా సూపర్ హిట్ అయింది. దాంతో ఈసినిమా తరువాత నివేద థామస్ కు వరుసగా అవకాశాలు దక్కాయి. నిన్నుకోరి , జై లవకుశ , 118 , బ్రోచేవారెవరురా , వకీల్ సాబ్ ఇలా పలు హిట్లను కూడా అందుకుంది. ఇక తన నుండి వచ్చిన చివరి సినిమా శాకిని డాకిని. అయితే ఈ సినిమా తరువాత ఇప్పటి వరకూ నివేదా థామస్ నుండి ఎలాంటి సినిమా రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు మరో కొత్త సినిమాతో వస్తుంది. నంద కిషోర్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ను నేడు ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 35.. చిన్న కథ కాదు అన్న టైటిల్ తో ఈసినిమా వస్తుంది. టైటిల్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచారు.
కాగా ఈసినిమాలో ఇంకా ప్రియ దర్శని, విశ్వదేవ్ లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. టాలెంటెడ్ హీరో రానా దగ్గబాటి ఈసినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























