కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మెగాస్టార్ కృతజ్ఞతలు

Megastar Chiranjeevi Thanks To Union Minister Bandi Sanjay Kumar

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఇలా తెలిపారు. “నిన్న రాత్రి ఆప్యాయంగా సందర్శించినందుకు ప్రియమైన సోదరుడు బండి సంజయ్‌కు ధన్యవాదాలు. మీ ప్రయాణానికి నేను హృదయపూర్వకంగా ఉన్నాను మరియు గౌరవనీయమైన హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రిగా మీ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడంలో మీకు శుభాకాంక్షలు! దేవుడు అనుగ్రహించు గాక” అని పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చిరంజీవిని కలిశారు. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ లోని మెగాస్టార్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కేంద్రమంత్రిని సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సత్కరించారు. ఇరువురూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కుశలప్రశ్నలు వేసుకున్నారు. అనంతరం దేశ, తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఇక ఇటీవలే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మరియు జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఏపీ రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ కూడా చిరంజీవిని కలుసుకున్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.