పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD’. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ వహించాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, ఉలగనాయగన్ కమల్ హాసన్, ప్రముఖ బెంగాలీ యాక్టర్ శాశ్వత ఛటర్జీ, నటకిరీటి రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ప్రాజెక్టుగా రూపొందిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ-ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేశారు. దీనిలో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్‌కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఇటీవలే రిలీజ్ చేసిన ‘భైరవ ఆంథమ్’ ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్‌గా టాప్ చార్ట్‌లో వుంది. మరికొన్ని గంటల్లో రిలీజ్ ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు. ఈ రకంగా ఫెంటాస్టిక్ ప్రమోషనల్ కంటెంట్‌తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అలాగే కల్కి వరల్డ్ గురించి నాగ్ అశ్విన్ పలు ఆసక్తిక విషయాలు తెలియచేస్తూ ఎపిసోడ్స్ రూపంలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ విడుదల చేయగా.. మొదటిదానిలో కలియుగం, కల్కి అవతారం గురించి చెప్పారు.
ఇక రెండో ఎపిసోడ్లో మూడు ప్రపంచాలను పరిచయం చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. కలియుగం ముగిసిన తరువాత మిగిలిన ఆఖరి నగరంగా కాశీ, దీనిపైన మరో ప్రపంచం కాంప్లెక్స్, అలాగే మూడో ప్రపంచం శంబాలా గురించి వివరించారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో అద్భుతమైన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాలో కీలకంగా ఉండే శంబాలా ప్రపంచాన్ని ఆవిష్కరించారు. కాగా ఇది సినిమాకే హైలెట్‌గా ఉండనుందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ కల్కిపై అంచనాలను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























