ఎన్టీఆర్ -కొరటాల శివల దేవర కు క్రేజ్ మాములుగా లేదు.ఫస్ట్ పార్ట్ విడుదలకు ఇంకా 3నెలలకు పైగా సమయం వున్నా అప్పుడే థియేట్రికల్ బిజినెస్ పూర్తయింది.టీజర్ తోపాటు రీసెంట్ గా వచ్చిన సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో థియేట్రికల్ రైట్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని ఏరియాలకుగాను బిజినెస్ కంప్లీట్ అయ్యింది.బడా డిస్ట్రిబ్యూటర్లు ఫాన్సీ రేటుకు ఈ హక్కులను దక్కించుకున్నారని సమాచారం.కరెక్ట్ నంబర్ అయితే బయటికి రాలేదు కానీ 100కోట్ల పైనే బిజినెస్ చేసిందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా ఓవర్సీస్ తోపాటు మిగితా భాషల్లో బిజినెస్ క్లోజ్ కావాల్సివుంది.అంతా కలిపి థియేట్రికల్ రైట్స్ రూపంలో 200కోట్ల వరకు బిజినెస్ జరుగనుంది.ఇప్పటికే డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడయ్యాయి.నెట్ ఫ్లిక్స్ ఈహక్కులను భారీ ధరకు దక్కించుకుంది.నాన్ థియేట్రికల్ రూపంలో కూడా 200కోట్ల వరకు బిజినెస్ జరుగొచ్చు.
ఇక షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం గోవాలో ఓ కీలక షెడ్యూల్ ను చేస్తున్నారు.ఈ షెడ్యూల్ తో షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లే.జూలై లోపు మొత్తం కంప్లీట్ కానుంది.రిలీజ్ డేట్ కూడా ముందుకు జరిగింది.ముందు అక్టోబర్ 10న దింపాలనుకున్నారు కానీ అంతకన్నా ముందుగానే సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























