అసలు పేరు అందుకే మార్చా-అడివి శేష్

talented actor adivi sesh reveals why he changed his name

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో అడివి శేష్ పేరు కూడా ముందుంటుంది. చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ మొదలుపెట్టిన అడివి శేష్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో చూస్తూనే ఉన్నాం. హీరో గా మాత్రమే కాదు.. రచయితగా కూడా తన మార్కును చూపించాడు. క్షణం సినిమాతో రచయితగా కూడా అడివి శేష్ ఆ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం అయితే అడివి శేష్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గూఢచారి 2, డెకాయిట్ సినిమాలు తన లిస్ట్ లో ఉన్నాయి. రెండు సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ అసలు పేరు ఏంటో తెలుసా? తన అసలు పేరును శేష్ ఎందుకు మార్చుకున్నాడో తెలుసా? దీనిపై శేష్ తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. నా అసలు పేరు సన్నీ చంద్ర. నేను స్టేట్స్ లో ఉన్నప్పుడు అక్కడ ఆరెండ్ ఫ్లేవర్ తో సన్నీ డిలైట్ అనే డ్రింక్ ఉండేది దాంతో నా ఫ్రెండ్స్ నా పేరును టీజ్ చేసేవారు.. అదే టైమ్ లో సన్నీ లియోన్ కూడా అక్కడ పాపులర్ దాంతో యంగ్ గాయ్స్ అందరూ నా పేరును ఆటపట్టిస్తుండేవారు. అప్పుడు నేను మా న్నాన్నతో నాపేరును టీజ్ చేస్తున్నారు అని చెప్పాను.. అప్పుడు ఆయన శేష్ కూడా నా పేరులో ఉందని చెప్పారు. నేను ఒక్కసారే షాక్ అయ్యాను.. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడూ తను నాకు ఆ విషయం చెప్పలేదు.. ఆ తరువాత నేను నాపేరులో శేష్ ని యాడ్ చేసుకున్నా.. ఇక్కడికి వచ్చాక తెలిసింది.. ఇక్కడ శేష్ అనేది కామన్ పేరని అంటూ క్లారిటీ ఇచ్చాడు.

కాగా క్షణం, గూఢచారి తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు డివోపీగా పనిచేసిన షానీల్ డియో డెకాయిట్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మేజర్ ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో గూఢచారి 2 వస్తుంది. ఈసినిమాలో బనితా సంధు హీరోయిన్ గా నటిస్తుంది. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్ ‌లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.