దేవర నుంచి ఫియర్ సాంగ్‌ లిరికల్ వీడియో రిలీజ్

Fear Song Lyrical Video Released From Devara

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ‘జన‌తా గ్యారేజ్’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఇప్పటివరకు జూనియర్ నుంచి సినిమా రాలేదు. దీంతో దేవర సినిమా అప్‌డేట్స్ గురించి తారక్ ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ఆకట్టుకున్నాయి. ఇక ఫియర్ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్లకుపైగా వ్యూస్‌తో దూసుకుపోతుండగా.. తాజాగా మేకర్స్ దీనికి సంబంధించి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. దీనిని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు.

ఇక హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ పతాకాలపై సుధాకర్‌, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తుండగా.. శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా, సాబు సిరిల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. కాగా విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యం, ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. ఫస్ట్ పార్ట్ ద‌స‌రా కానుక‌గా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.

ఇదిలావుంటే, మరోవైపు ఈ సినిమా తర్వాత తారక్ ‘వార్ 2’ మూవీతో బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. అలాగే ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ ఓ భారీ చిత్రం చేయనున్నారు. ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.