నాగ్ అశ్విన్‌ను బాలచందర్‌తో పోల్చిన కమల్ హాసన్

Kamal Haasan Compared Kalki Director Nag Ashwin with Legendary Film Maker Balachander

దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా కనిపించనున్నారు. విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్‌లో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ-ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేశారు. దీనిలో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్‌కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇటీవలే రిలీజ్ చేసిన ‘భైరవ ఆంథమ్’ ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్‌గా టాప్ చార్ట్‌లో వుంది. ఈ రకంగా ఫెంటాస్టిక్ ప్రమోషనల్ కంటెంట్‍తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపధ్యంలో తాజాగా మేకర్స్ ముంబైలో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‍లో కల్కి టీంతో హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఇంటరాక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ‘కల్కి 2898 AD’ యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా ఉలగ నాయగన్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. “నాగ్ అశ్విన్ మా గురువు గారు బాలచందర్ గారిలా ఆర్డీనరిగా కనిపించే ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్. తన ఐడియాని అద్భుతంగా ప్రజెంట్ చేసే నేర్పు నాగ్ అశ్విన్ కి వుంది. ఇందులో బ్యాడ్ మ్యాన్‌గా ప్లే చేస్తా. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. నాగ్ అశ్విన్ చాలా డిఫరెంట్‍గా ప్రజెంట్ చేశారు. నా ఫస్ట్ లుక్ చూసి సర్‌ప్రైజ్‍ అయినట్లే సినిమా చూసి కూడా చాలా సర్‌ప్రైజ్‍ అవుతారు” అని చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.