రీసెంట్‌గా మనమేతో వచ్చి డీసెంట్ హిట్ కొట్టాడు హీరో శర్వానంద్. ఇప్పటికీ ఈ సినిమా పర్వాలేదనే వసూళ్లను రాబట్టుకుంటుంది. ఈ సినిమా తరువాత శర్వా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో 37వ సినిమా ఒకటి. సామజవరగమనతో బ్లాక్ బాస్టర్ అందించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలోని హీరోయిన్ ను పరిచయం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాక్షి వైద్య ఇందులో కథానాయికగా నటిస్తుంది. ఈరోజు తన బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ లో సాక్షి స్టైలిష్ లుక్ లో కనిపించింది.ఇందులో ఆమె నిత్య పాత్రలో నటిస్తుంది.తెలుగులో సాక్షికి ఇది మూడో సినిమా.ఇంతకుముందు ఏజెంట్,గాండీవధారి అర్జున లో నటించగా ఈరెండు విజయాన్ని అందించలేకపోయాయి.మరి శర్వా 37రూపంలో ఈసారైనా ఆమెకు సక్సెస్ వస్తుందో చూడాలి.ఈసినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఈఏడాది చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక శర్వానంద్ ప్రస్తుతం అభిషేక్ కంకర డైరెక్షన్ లో తన 36వ సినిమాలో కూడా నటిస్తున్నాడు.అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా యువి క్రియేషన్స్ నిర్మిస్తుంది.కుదిరితే ఈసినిమా కూడా ఈఏడాదే వచ్చే ఛాన్స్ వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























