అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా శివం భజే. గంగ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షించుకుంది. ఇక ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను నేడు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ అయితే ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఫస్ట్ గ్లింప్స్ అయితే ఆకట్టుకుంటుంది. గ్లింప్స్ ను బట్టి ఈసినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రానున్నట్టు అర్థమవుతుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇక గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
కాగా ఈసినిమాలో అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా అర్బాజ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసీ, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, షకలక శంకర్, కాశీ విశ్వనాథ్, ఇనయ సుల్తానా తదితరులు నటిస్తున్నారు. వికాస్ బడిస సంగీతం.. సినిమాటోగ్రాఫర్ గా దాశరథి శివేంద్ర పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































