పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజీ. సుజీత్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఓజీ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. అయితే ఈ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుంది.. పవన్ ఎప్పటినుండి షూటింగ్ లో పాల్గొంటారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈసినిమా నుండి సాలిడ్ అప్ డేట్ ఇచ్చాడు మ్యూజికల్ డైరెక్టర్ థమన్. తన ట్విట్టర్ ద్వారా థమన్.. ఓజీ మిషన్లో ఉన్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ బ్లాస్ట్ ఆన్ ది వే.. అంటూ స్పీకర్స్ తో ఉన్న పోస్టర్ తో ట్వీట్ చేశాడు. ఇక థమన్ ట్వీట్ ను బట్టి ఫస్ట్ సింగిల్ బాక్సుల్ బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు. చూద్దాం ఫస్ట్ సింగిల్ అప్ డేట్ కూడా త్వరలోనే వస్తుందేమో.
THE MAN is on a mission 😁🔥#TheyCallHimOG #OG @MusicThaman pic.twitter.com/Q2yICvolaR
— DVV Entertainment (@DVVMovies) June 17, 2024
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































