టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన తాజా చిత్రం ‘కన్నప్ప’. భక్తిరస ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద విష్ణు తండ్రి, సీనియర్ నటుడు డా.మోహన్ బాబు నిర్మించారు. ఇక ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు భాగమయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా సంగీతం అందించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు కన్నప్ప చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో విష్ణు మంచు ఒక కీలక విషయం చెప్పారు. ఆయన ఏమన్నారంటే..? “కన్నప్ప మైథాలజీ కాదు.. కన్నప్ప మన చరిత్ర. కట్టు కథ అంటే నమ్మకండి.. రెండో శతాబ్దంలో జరిగిన కథ. చోళ రాజుల టైంలో జరిగింది. ఏడో శతాబ్దంలోనూ కన్నప్ప గురించి శంకరాచార్యులవారు చెప్పారు. 14వ శతాబ్దంలో నాయనార్ల గురించి ధూర్జటి రాశారు. అందులో 9వ నాయనార్ కన్నప్ప.18వ శతాబ్దంలో బ్రిటీష్ వాళ్లు ఇంగ్లీష్‌లో ప్రింట్ చేశారు. బికనీర్ యూనివర్సిటీలో ఆ పుస్తకం చూశాం. ఆ పుస్తకాన్ని చదివి.. ఎంతో జాగ్రత్తగా తీసి ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నాం” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “నేను రెండో శతాబ్దం కథను చెబుతున్నాను. దానికి తగ్గట్టుగా ఉండాలనే న్యూజిలాండ్ లొకేషన్లో సినిమాను తీశాం. బడ్జెట్ గురించి ఆలోచించలేదు. చరిత్రలో నిలిచిపోయే సినిమా తీస్తున్నామని ముందుకు వెళ్లాం. ఈ కన్నప్ప కోసం ఇంత మంది ఆర్టిస్టులని ఎందుకు తీసుకున్నామనేది సినిమా చూస్తేనే అందరికీ అర్థమవుతుంది. నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ అద్భుతంగా నటించారు. ఇది నా వర్షెన్‌లో రాసుకున్న ‘కన్నప్ప’. అందుకే వరల్డ్ ఆఫ్ కన్నప్ప అని అందరినీ ఆహ్వానించాం. ఈ కన్నప్ప మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. హర హర మహదేవ్” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























