ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు. అందుకే వరుసగా అప్ డేట్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుటికే పలు పోస్టర్లు, వీడియోలు రిలీజ్ చేసి మంచి హైప్ ను క్రియేట్ చేయగా.. రీసెంట్ గానే ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇండియా బిగ్గెస్ట్ సాంగ్ లోడ్ అవుతోంది అంటూ ఓ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఇద్దరు వ్యక్తులు చేతులు కలుపుతున్నట్లు చూపెట్టారు.
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























