ఏపీలో ప్రభుత్వం మారిన సంగతి తెలిసిందే కదా. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ తో సహా మిగిలిన వారు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులకు ఏ శాఖలు వస్తాయా అని చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏ శాఖ తీసుకుంటారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దానిపై కూడా క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు శాఖలు దక్కాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎంగా ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇంకా ముందు నుండీ అనుకుంటున్నట్టే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు కేటాయించారు.
కాగా ఇప్పటికే రీఎంట్రీ తరువాత వరుసగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలతో బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఓజీ సినిమా ఒకటి ఇంకా క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న హరిహర వీరమల్లు సినిమా ఒకటి. ఈ మూడు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. మరి పూర్తిగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ ఈ మూడు సినిమాలను ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























