మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి విశిష్ట దర్శకత్వంలో రాబోతున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. జులై నాటికి ఈసినిమా షూటింగ్ పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే గ్రాఫిక్స్ కు టీమ్ ఎక్కువ సమయం కేటాయించనున్నారట. ఇప్పటికే ఈసినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమాలో మరో టాలెంటెడ్ నటుడు కూడా జాయిన్ అయ్యాడు. ఆ నటుడు ఎవరో కాదు బాలీవుడ్ లో తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కునాల్ కపూర్. విశ్వంభర సినిమాలో కునాల్ కపూర్ నటిస్తున్నట్టు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు.
కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. సురభి ,ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఈసినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. ఈసినిమాను వచ్చేే ఏడాది సంక్రాంతికి జనవరి 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























