లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘థగ్ లైఫ్’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. కాగా పొన్నియిన్ సెల్వన్ 2 తరువాత లెజండరీ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న సినిమా ఇదే. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, త్రిష ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. యంగ్ హీరోలు శింబు, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్ మరియు పాపులర్ మాలీవుడ్ యాక్టర్ జోజు జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతుంది. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ‘థగ్ లైఫ్’ నుండి ఒక కీలక సమాచారం వచ్చింది. ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్‌పోర్టులో యాక్షన్ సన్నివేశాలలో భాగంగా హెలికాప్టర్ జంపింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా నటుడు జోజు జార్జ్‌కి గాయమైంది. దీంతో చిత్ర యూనిట్ వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించింది. ఎడమకాలికి గాయమైనట్లు గుర్తించిన వైద్యులు ప్రాధమిక చికిత్స అందించి జోజు జార్జ్ కాలికి పట్టీ వేశారు. అనంతరం జోజును డిశ్చార్జ్ చేయగా.. స్టిక్ సాయంతో ఆయన నడుచుకుంటూ వస్తున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఆయనకు డాక్టర్స్ కొద్దిరోజులు బెడ్ రెస్ట్ సూచించినట్లు తెలుస్తోంది.
‘థగ్ లైఫ్’ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్‌పై కమల్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. అక్టోబర్ లోగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివరిలో సినిమాను విడుదలచేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు కమల్ హాసన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడి’లో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా జూన్ 27న విడుదలవుతుంది. అలాగే జూలై 12న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన ‘ఇండియన్ 2’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక దీనికి సీక్వెల్‌గా రానున్న ‘ఇండియన్ 3’ షూటింగ్‌ను కూడా కమల్ ఇప్పటికే పూర్తి చేశారు. ఈ రెండు సినిమాలకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























