మెగా బ్రదర్స్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటామంతి.. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న విషయం. నేషనల్ మీడియాలో సైతం ఈ వార్తకు అధిక ప్రాధాన్యం లభించిందంటే అర్ధం చేసుకోవచ్చు ఇది ఎంత సెన్సేషన్ అయిందో. ఈ అపూర్వ సన్నివేశానికి వేదికైంది మాత్రం ఆంధ్రప్రదేశ్. బుధవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా మొత్తం 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార తతంగం ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని ఆయన సోదరుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు స్వయంగా వెళ్లడం విశేషం. ఈ సందర్భంగా మెగా బ్రదర్స్ ఇద్దరినీ చెరొకవైపు ఉంచుకుని ప్రధాని మోదీ చేతులు పైకెత్తి విజయ సంకేతం చూపించడం వేడుకకే హైలైట్‌గా నిలిచింది. అలాగే చిరు తమ్ముడి బుగ్గలు పట్టుకుని మురిసిపోయారు. ఈ ఘట్టాన్ని వీక్షించిన సభకు హాజరైన లక్షలాదిమంది ప్రజలు, కార్యకర్తలు, మెగాభిమానులు జయజయధ్వానాలు చేశారు. అలాగే వేదిక ముందు భాగంలో ఉండి ఈ సన్నివేశాన్ని చూసిన మెగా ఫ్యామిలీ సభ్యులు సైతం భావోద్వేగంతో పులకించిపోయారు.
అయితే ఈ సందర్భంగా ప్రధాని మోదీ మెగా బ్రదర్స్‌తో ఏదో చెప్పడం కనిపించింది. ప్రత్యేకించి చిరుతో పవన్ కళ్యాణ్ గురించి ఎదో చెప్పడం గమనించొచ్చు. దీనిపై అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా దేశ చరిత్రలో కాంగ్రెసేతర వ్యక్తి వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రి పదవిని అలంకరించడం ఇదే తొలిసారి.స్వాతంత్య్రం అనంతరం మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒక్కరే ఇప్పటివరకు మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఆ రికార్డుని సమం చేశారు. అంతటి స్థాయి కలిగిన నేత చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో ప్రత్యేకంగా సంభాషించడం, వారికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం యావత్ తెలుగు ప్రజలందరికీ గర్వకారణం.
అయితే ప్రధాని చిరుతో ఏం మాట్లాడారు? అనేదానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై మెగాస్టారే స్వయంగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై బుధవారం రాత్రి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా నిన్న వేదికపై తమతో ప్రయాణి మోదీ ఏం మాట్లాడారో తెలిపారు. కాగా చిరు ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మెగాభిమానులు దీనిని పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోలపై ప్రధానమంత్రి చూపించిన ప్రేమకు వారు ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాగా చిరు ఏం చెప్పారో మీరూ ఓ లుక్కేయండి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























