ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా మొత్తం 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి వద్ద అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వేడుకకు చిత్ర పరిశ్రమ నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి సతీమణులతో కలిసి వచ్చారు. ఈ కార్యక్రమంలో వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీవీఐపీలకు కేటాయించిన స్పెషల్ గ్యాలరీలో ఈ అగ్ర హీరోలు పక్కపక్కనే ఆసీనులయ్యారు. ఇక వీరితో పాటుగా మరో టాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణ కూడా హాజరై సందడి చేశారు. ఇంకా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నారా రోహిత్, దర్శకుడు బోయపాటి శ్రీను, స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.
కాగా, ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ, గవర్నర్, సీఎం సహా మంత్రులందరితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ని ఆప్యాయంగా హత్తుకుని అభినందించారు. ఇదే క్రమంలో పవన్ తన సోదరుడు చిరంజీవి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారని చెప్పగా.. ఎక్కడ ఉన్నారు? అంటూ ప్రశ్నించారు. చిరంజీవి కూర్చుని ఉన్న వైపు పవన్ చూపించగా పద వెళదాం అంటూ పవన్ చేయి పట్టుకుని అటువైపు అడుగులు వేశారు. ఈ సందర్భంగా అక్కడకు వెళ్లిన ప్రధాని మోదీ మెగాస్టార్‌ని ఆలింగనం చేసుకున్నారు. ఒకవైపు చిరు, మరోవైపు పవన్‌లతో కలిసి ఫోటోలు దిగారు.
ఇదే సమయంలో సీఎం చంద్రబాబు రజినీకాంత్ కూడా ఇక్కడే ఉన్నారని ప్రధానికి చెప్పడంతో ఆయన వద్దకు వెళ్లారు. రజినీతో కరచాలనం చేసిన మోదీ ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. అలాగే ఆయన సతీమణితో కూడా కరచాలనం చేశారు. ఇక వారి పక్కనే నిల్చున్న మరో అగ్ర నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను చుసిన ప్రధానమంత్రి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. కాగా అగ్ర హీరోలు, అభిమాన నేతలు అందరూ ఇలా ఒకే వేదికపై కనిపించడం ఇటు అభిమానులతో పాటు అటు వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































