గత ఏడాది సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది ఓం భీమ్ బుష్ సినిమాతో సెకండా హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్లను ను అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. శ్రీవిష్ణు హీరోగా త్వరలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా స్వాగ్. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ కానీ పోస్టర్లు మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలో నటిస్తున్న కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లను వరుసగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే రీతూవర్మ, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్ ల ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు తాజాగా మరో నలుగురి పోస్టర్లను రిలీజ్ చేశారు మేకర్స్. మన అచ్చ తెలుగు సినిమా.. తెలుగు తనాన్ని పెంచనున్న మగజాతి ఆణిముత్యాలు అంటూ సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ పోస్టర్లను విడుదల చేశారు. డిఫరెంట్ గెటప్పుల్లో ఉన్న నలుగురి పోస్టర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి.
కాగా ఈసినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు. హసిత్ గోలితో శ్రీవిష్ణు చేస్తున్న రెండో సినిమా ఇది. ఇక రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. జూలై ఫస్ట్ వీక్ లో ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























