కల్కి ట్రైలర్ రన్  టైం డీటైల్స్ 

Kalki 2898 AD Trailer out Today at 7pm

ప్రభాస్ కల్కి 2898 ఏడి ట్రైలర్ మరి కొన్ని గంటల్లో యూట్యూబ్ ను షేక్ చేయనుంది.దాంతో అందరి కళ్ళు ఈట్రైలర్ పైనే వున్నాయి.ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్ కౌంట్ డౌన్  పోస్టర్లు ఇంట్రెస్టింగ్ గా ఉండి అంచనాలు పెంచేశాయి. ఇక ఈ ట్రైలర్  ఈరోజు రాత్రి 7గంటలకు విడుదలకానుంది.3నిమిషాల 10 సెకండ్ల రన్ టైం తో రానున్న ఈ ట్రైలర్ అదిరిపోయిందని ఇన్సైడ్ టాక్. మరోవైపు  యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ఎన్ని రికార్డులు సృస్టించిస్తుందోనని ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే యూట్యూబ్ లో  రిలీజ్ చేసే ఒక గంట ముందు ట్రైలర్ ను థియేటర్లలో ప్లే చేయనున్నారు. చాలా రోజుల తరువాత వస్తున్న పెద్ద సినిమా కావడంతో కల్కికి హైప్ భారీ గా ఉంది. ట్రైలర్ కూడా దానికి తగ్గట్లు ఉంటే రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ఖాయం

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రమోషన్ లలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఓ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తుంది కల్కి టీం.అతి త్వరలో ఈ ఈవెంట్ గురించి అధికారిక ప్రకటన రానుంది.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్, దీపికా పదుకొణె ,దిశా పటాని కీలక పాత్రల్లో నటించారు. వీరితోపాటు మరికొంత మంది స్టార్స్ క్యామియో రోల్ లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. ఈనెల 27న కల్కి భారీ స్థాయిలో విడుదలవుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.