టాలీవుడ్ యంగ్ హీరోలే ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడానికి కష్టపడుతుంటే సీనియర్ హీరోలు మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అందులో నటసింహం బాలకృష్ణ కూడా ఒకరు. బాలకృష్ణ గత ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ ను అందుకున్నాయి. ఇక ఈ ఏడాది మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ టైటిల్ ను అయితే ఫిక్స్ చేయలేదు కానీ ఎన్బీకే 109 అనే టైటిల్ తోనే సినిమా షూటింగ్ ను చేస్తున్నారు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నేడు బాలకృష్ణ పుట్టినరోజు అన్న సంగతి కూడా విదితమే. ఈ సందర్భంగా నేడు ఈసినిమా నుండి నేడు అప్ డేట్ ఇస్తున్నట్టు ఇప్పటికే అప్ డేట్ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే తాజాగా బాలకృష్ణ స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు..వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది..జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు అంటూ వచ్చిన గ్లింప్స్ అయితే అదిరిపోయింది.
The 𝐌𝐎𝐍𝐒𝐓𝐄𝐑 has arrived!! ⚒️🪓 #NBK109 Birthday Glimpse Out Now 💥💥 – https://t.co/ihhXM6XgmC
Wishing the GOD OF MASSES #NandamuriBalakrishna garu a very Happy Birthday! 🔥#HappyBirthdayNBK 🦁@dirbobby @MusicThaman @thedeol @Vamsi84 #SaiSoujanya @KVijayKartik… pic.twitter.com/Awu79R6uIA
— Sithara Entertainments (@SitharaEnts) June 10, 2024
కాగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































