తెలుగు మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. హృదయ సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని స్వగుర్హనికి తరలించి అభిమానుల సందర్శనార్ధం ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అక్కడికి వెళ్లి రామోజీరావుకు నివాళులర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలావుంటే.. రామోజీ రావు మృతి చెందడం పట్ల తెలుగు సినీ ఇండస్ట్రీ స్పందించింది. రామోజీ మృతి పట్ల అగ్ర నటులు సహా సినీ పరిశ్రమకు చెందిన అన్ని క్రాఫ్టుల వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలుగునాట మీడియా మొఘల్ గా పేరుగాంచిన రామోజీరావుకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో రామోజీ మృతికి సంతాప సూచికంగా ఆదివారం చిత్ర పరిశ్రమకు బంద్ ప్రకటించారు. ఈ మేరకు చలనచిత్ర నిర్మాతల మండలి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దీంతో రేపు తెలుగు రాష్ట్రాలలో అన్ని షూటింగ్‌లూ నిలిపివేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































