తెలుగు మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చెరుకూరి రామోజీరావు అస్తమించారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఈనెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తగా కుటుంబసభ్యులు హుటాహుటిన నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం వైద్యులు గుండెకు స్టెంట్ వేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో ఐసీయూలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రామోజీరావు ఈ తెల్లవారుజామున మృతిచెందారు. ఈ మేరకు రామోజీ వేకువ జామున 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. కాగా రామోజీరావు మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, త్వరలో ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు రామోజీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రామోజీ రావు ప్రస్థానం.. నెలకొల్పిన సంస్థలు!
కాగా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న రామోజీరావు జన్మించారు. గుడివాడలో విద్యాభాస్యం పూర్తి చేసుకున్న ఆయన 1962 అక్టోబరులో మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. ఈ క్రమంలో 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ‘ఈనాడు’ దినపత్రికను ప్రారంభించారు. ఇక్కడినుంచి రామోజీరావు వెనుదిరిగి చూసుకోలేదు. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక పాఠకులను సంపాదించుకుని ఈనాడు పత్రిక సంచలనాలను సృష్టించింది. ప్రాంతీయ దినపత్రికల చర్రితలో ‘ఈనాడు’ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
1983లో ‘ఉషాకిరణ్ మూవీస్’ సంస్థను ఏర్పాటు చేశారు రామోజీరావు. ఈ బ్యానర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 1990లో రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ను కూడా ప్రారంభించారు. ఇక సినీ ప్రియుల కోసం ‘సితార’ పత్రికతో పాటు ‘చతుర’, ‘విపుల’ మాస పత్రికలును కూడా తీసుకొచ్చారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ‘రామోజీ ఫిల్మ్ సిటీ’ని నిర్మించారు. సినిమాల నిర్మాణానికి సంబంధించి షూటింగ్ సహా సకల వసతులను కల్పించారు. ఈ క్రమంలో ఈటీవీ నెట్‌వర్క్, రమాదేవి పబ్లిక్ స్కూల్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ తదితర సంస్థలు ఆయన నెలకొల్పినవే.
రామోజీరావును వరించిన అవార్డులు..
రామోజీరావు తెలుగు సినిమాలలో రచనలకు గాను నాలుగు సౌత్ ఇండియా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఐదు నంది అవార్డులు, నేషనల్ ఫిల్మ్ అవార్డు సైతం ఆయన్ని వరించాయి. ఇంకా 2016లో, జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన అందించిన సేవలకు గాను పద్మభూషణ్, పద్మ విభూషణ్ అందుకున్నారు. ఇక రామోజీరావుకు ఇద్దరు కుమారులు కాగా, చిన్న కుమారుడు సుమన్ లుకేమియాతో 2012 సెప్టెంబర్ 7న మరణించారు. ఇక పెద్ద కుమారుడు కిరణ్ రామోజీరావు నెలకొల్పిన అన్ని సంస్థలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































