ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ కేవలం డాన్స్ మాస్టర్ గానే కాకుండా ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్నారు. అనేక సినిమాలలో నటించడంతో పాటు కొన్నింటికి దర్శత్వం కూడా వహించి ఆయన సూపర్ హిట్స్ అందుకున్నారు. వీటిలో రాఘవ లారెన్స్ స్వయంగా నటించి దర్శకత్వం వహించిన ‘కాంచన’ సిరీస్ సినిమాలు ప్రత్యేకం. హారర్ ఎలెమెంట్స్కి కామెడీ జోడించి తీసిన ఈ సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్నిచ్చాయి. ఒకవైపు నవ్విస్తూనే మరోవైపు భయపెట్టడం ఈ చిత్రాల ప్రత్యేకత.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈ సిరీస్‌లో 3 చిత్రాలు రాగా అన్నీ విజయం సాధించాయి. ఈ క్రమంలో మరో మూవీకి శ్రీకారం చుట్టారు రాఘవ లారెన్స్. కాంచన సిరీస్‌లో భాగంగా 4వ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ‘కాంచన 4’ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ మూవీకి కూడా లారెన్స్ స్వయంగా దర్శకత్వం వహించనున్నారని తెలిపారు. ఇక త్వరలోనే ఈ సినిమాలో నటించనున్న నటీనటులు మరియు పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు.
#Kanchana4 shoot this September 2024 pic.twitter.com/nuZocTZfO3
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) June 6, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























