కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. మే 31వ తేదీన రిలీజ్ అయింది ఈసినిమా. ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా విశ్వక్ సేన్ తమ మాస్ నటనతో మరోసారి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో ఈసినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు విశ్వక్ సేన్. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా ఎక్కడా తగ్గట్లేదు. ఐదు రోజుల్లో ఈసినిమా 19 కోట్లను రాబట్టుకోగా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను కూడా సాధించినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ అయిన తరువాత కూడా ఈసినిమా నుండి అప్ డేట్లు ఇస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఎనర్జిటిక్ గిరి గిరి అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. రామ్ మిరియాల పాడిన ఈపాటకు శ్యామ్ లిరిక్స్ అందించారు..
కాగా ఈసినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించగా.. సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యువన్ శంకర్ రాజా ఈసినిమాకు సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























