ఈసంక్రాంతికి పెద్ద సినిమాగా వచ్చింది గుంటూరు కారం.ఈ సినిమా 200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది.అయితే అదే టైంలో చిన్న సినిమాగా వచ్చి 300కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది హనుమాన్. ఈఏడాదిలో ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్ట్ చేసింది ఈసినిమానే. ఇక మధ్యలో వచ్చిన టిల్లు స్క్వేర్ 100కోట్ల మార్క్ ను దాటింది.ఈమూడు సినిమాలు తప్పితే మరో సినిమా ఆ మార్క్ దాటలేదు.అయితే గుంటూరు కారం తరువాత చాలా రోజులకు తెలుగులో పెద్ద సినిమా రీలీజ్ అవుతుంది అదే కల్కి 2898 ఏడి.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా ఇది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గుంటూరు కారం రీజినల్ మూవీ గా విడుదలైంది కానీ కల్కి గ్లోబల్ మూవీ గా వస్తుంది అంతేకాదు భారీ బడ్జెట్ సినిమా.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.హైప్ కి తోడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారడంతో టికెట్ హైక్స్,స్పెషల్ షోలకు పర్మిషన్ రానున్నాయి దాంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే 1000కోట్ల సినిమా కానుంది.
ఇక ఈనెల 10న కల్కి ట్రైలర్ విడుదలకానుంది.అందరి చూపు ఈ ట్రైలర్ పైనే వుంది.మరి రీసెంట్ గా సలార్ తో బ్లాక్ బాస్టర్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన ప్రభాస్ కు కల్కి మరో విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























