ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే (టీడీపీ+జనసేన+బీజేపీ) కూటమి ఘనవిజయం సాధించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే కూటమిగా పోటిచేయగా.. అధికార వైఎస్సార్సీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి దాదాపు 93శాతం ఓటుతో ఏకంగా 164 సీట్లు గెలిచి సంచలన విజయం నమోదు చేసింది. ఇది దేశంలోనే ఒక రికార్డుగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ విజయంపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ మరియు ఆయన సోదరుడు, హీరో కళ్యాణ్ రామ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వారు తమ కుటుంబసభ్యులైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, నారా లోకేష్ మరియు శ్రీ భరత్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్‌కు కూడా ఈ ఇరువురు హీరోలు శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన @PawanKalyan గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
— Jr NTR (@tarak9999) June 5, 2024
జనసేన అధ్యక్షులు @pawankalyan గారికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు నా శుభాకాంక్షలు.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 5, 2024
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘దేవర’ మూవీలో నటిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దేవర’ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుండగా.. ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది.
మరోవైపు ఈ సినిమా తర్వాత తారక్ ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించనున్నారు. అలాగే ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ భారీ చిత్రం చేయనున్నారు. అలాగే కళ్యాణ్ రామ్ హీరోగా #NKR21 అనే ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే దీనికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























