ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే (టీడీపీ+జనసేన+బీజేపీ) కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే కూటమిగా పోటిచేయగా.. అధికార వైఎస్సార్సీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ఏకంగా 164 సీట్లు గెలిచి సంచలన విజయం నమోదు చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ విజయంపై టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. “అద్భుతమైన విజయం సాధించిన విజనరీ లీడర్ చంద్రబాబు గారికి శుభాకాంక్షలు” అని చరణ్ పేర్కొన్నారు.
Congratulations to the visionary @ncbn Garu on the astounding victory!
— Ram Charan (@AlwaysRamCharan) June 5, 2024
ఇక ఇదిలావుండగా.. సినిమాల విషయానికొస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జోడీగా కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇక దీని తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్లో ‘ఆర్సీ 16’లో నటించనున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. కాగా ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























