గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్

game changer shooting update

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది.ఈసినిమా ప్రారంభమై రెండున్నర ఏళ్లు  అవుతున్నఇంతవరకు కంప్లీట్ కాలేదు. డైరెక్టర్ శంకర్ కు వున్న కమిట్ మెంట్స్ వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ఇక ఈసినిమా  నెక్స్ట్ షెడ్యూల్ ఈవారంలో రాజమండ్రి లో స్టార్ట్ కానుంది.ఈషూటింగ్ లో చరణ్ తోపాటు నవీన్ చంద్ర, సునీల్ జాయిన్ కానున్నారు. వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది. ఆతరువాత హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగే షెడ్యూల్ లో చరణ్ పాల్గొంటాడు.దాంతో చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి కానుంది.ఆతరువాత మిగితా కాస్టింగ్ తో శంకర్ నెక్స్ట్ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నాడు.ఇది 20రోజులపాటు జరుగనుందట.ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెప్టెంబర్ కల్లా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి అక్టోబర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.ఒకవేళ అక్టోబర్ తప్పితే డిసెంబర్ లో రానుంది.సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈసినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఈసినిమా తరువాత రామ్ చరణ్, బుచ్చి బాబు తో సినిమాను మొదలు పెట్టనున్నాడు.ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుండగా  కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీస్ ,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.