OC మూవీ ట్రైలర్ రిలీజ్

oc telugu movie trailer out now

ఇప్పుడు చిన్న సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కథలో కంటెంట్ ఉండే హీరో, హీరోయిన్ ఎవరనేది కూడా చూడట్లేదు. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు బోంపల్లి దర్శకత్వంలో హరీష్ బోంపల్లి హీరోగా వస్తున్న సినిమా ఓసీ. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకునే పనులో ఉంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. పనిపాట లేని ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు.. వారికి సినిమా అంటే పిచ్చి ఉంటుంది. ఈనేపథ్యంలోనే సినిమాల్లో నటించడానికి పట్టణం వెళతారు.. అక్కడికి వెళ్లిన వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. ఫైనల్ గా ఏమయింది అనేదే ఈసినిమా కథ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో మాన్య సలాడి, రోయిల్ శ్రీ ఇంకా లక్ష్మీ కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భోలే షావళి ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. కౌండిన్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై బీవీఎస్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.